లోకమంతా జేజేలు.... అంతలో జైలు!
ఒక వ్యక్తి హఠాత్తుగా ఆకాశం అంత ఎత్తుకు ఎదగడం, అంతే
వేగంగా కిందపడిపోవటం ఎలా సాధ్యం? సత్యం రామలింగరాజు విషయంలో ఇదే జరిగింది. ఇరవై
ఏళ్లలో ఒక మహాసౌధ నిర్మాణం, పతనం అన్నీ జరిగిపోయాయి. సామాన్య రైతు కుటుంబంలో
పుట్టిన ఆయన్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులతో పాటు వేలకోట్ల రూపాయలు ఎలా
ఆర్జించారు? ఎవరూ ఊహించని విధంగా ఎలా జైలు పాలయ్యారు? ఆయన భవిష్యత్తు ఏమిటి?
గ్రహాలు చేసిన విన్యాసాన్ని చూద్దాం రండి.